About Girls Hostel

కమ్మ విద్యార్థినుల వసతి గృహ ప్రారంభము :

కమ్మ మహాజన సేవా సంఘం,నరసరావుపేట వారు నిర్మించిన విద్యార్థినుల వసతి గృహము ది. 12-11-2006 న ప్రారంభింపబడినది. ప్రారంభోత్సవంనకు కమ్మ సంఘమునకు చెందిన వివిధ రంగముల లోని విశిష్ట వ్యక్తులను ఆహ్వానించటం జరిగినది. మొదటి విద్యాసంవత్సరం 55 విద్యార్థినులతోను, 2 వ సంవత్సవరం 99 విధ్యార్ధినులతోను, 3వ సంవత్సరం 150 విద్యార్థినులతోను, 4వ సంవత్సరం 180 విద్యార్దినులతోను, 5వ సంవత్సరం 203 విద్యార్థినులతో, 6వ సంవత్సరం 227 విద్యార్థినులతో, 7 వ సంవత్సరం 251 విద్యార్థినులతో, 8వ సంవత్సరం 160 విద్యార్థినులతో, 9వ సంవత్సరం 207 మంది విద్యార్థినులతో వసతి గృహము నడుపబడుచున్నది.

Hostel Block Inauguration by prominent persons of Kamma Community

కమ్మ మహాజన సేవా సంఘము ప్రధాన ఉద్దేశ్యములలో ఒకటైన విద్యార్థినుల వసతి గృహ నిర్మాణమునకు ది. 28-8-2005 న ప్రముఖ దాత శ్రీ నల్లపాటి వెంకట రత్తయ్య గారిచే N.G.O కాలనీ 1వ లైన్ లో గల కమ్మ మహాజన సేవ సంఘమునకు చెందిన 0.52 సొంత స్థలములో శంఖుస్థాపన జరిగినది. వసతి గృహమునకు 8,000 చదరపు అడుగుల వైశాల్యము గల గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్థు నిర్మాణము 35 లక్షలతో పూర్తి చేయబడినది. పార్లమెంట్ సభ్యులు శ్రీ రాయపాటి సాంబశివరావు గారు ది. 26-01-2007 న శంఖుస్థాపన చేసిన 4,000 చదరపు అడుగుల వైశాల్యము గల రెండవ అంతస్తు మొత్తం మొదటి బ్లాకు 12,000 చదరపు అడుగుల వైశాల్యం మొత్తం షుమారు 52 లక్షలతో నిర్మాణము పూర్తి చేయబడి 25-10-2009 న ప్రారంభోత్సవం జరుపబడినది.

నిర్మాణమునకు ఈ దిగువ తెలియపరిచిన దాతలు భూరి విరాళముతో కొందరు,శక్తిమేర కొందరు ఆర్ధిక సహకార మందించినారు. శ్రీ నల్లపాటి వెంకట రత్తయ్య గారు రు 10,00,000/- భూరి విరాళమిచ్చి నందున మొదటి బ్లాకునకు శ్రీమతి నల్లపాటి రామతారకం వెంకటేశ్వర్ల  చౌదరి, శ్రీమతి నల్లపాటి లక్ష్మీసులోచన రత్తయ్య  బ్లాక్ గా  నామకరణం చేయడమైనది .

ఫస్ట్ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోరుకు శ్రీ గోనుగుంట్ల సత్యనారాయణ  & శ్రీ మతి వెంకటచలవమ్మ ఫ్లోరుగా పేరు నిర్ణయించడమైనది దీనికి వీరి కుమారుడు శ్రీ గోనుగుంట్ల ఆంజనేయులు గారు రూ. 3 లక్షలు ఇచ్చినారు.

ఫస్ట్ ఫ్లోర్ కు కీ||శే || గొడ్డిపాటి హనుమంతరావు , కీ||శే || డా|| గొడ్డిపాటి శేషగిరి రావుగార్ల ప్లోర్ గా పేరు నిర్ణయిచడమైనది. దీనికి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు రూ.3 లక్షలు ఇచ్చినారు. వీరు రెండువాబ్లాక్ నిర్మాణమునకు కూడా రూ.3,00,000/- లు విలువగల గ్రానైటును సప్లె చేసినారు. వెరసి వీరి విరాళము మొత్తము రూ . 6,00,000/-లు .

సెకండ్ ఫ్లోర్ కు కీ||శే || రావెళ్ల నాగేశ్వరరావు ఫ్లోర్ గా (విజయవాడ ) నిర్ణయించడమైనది. దీనికి వారి వారసులు రూ . 3 లక్షలు విరాళంగా ఇచ్చినారు.

ది 25-10-2019 ఆదివారంనాడు శ్రీ మతి నాగోతు జొస్పిన్ శౌరయ్య గార్ల మరియు శ్రీ మతి బొల్లినేని సుజాతమ్మ కృష్ణయ్యగార్ల బ్లాకునకు ,గౌరవనీయులు శ్రీ బొల్లా బ్రహ్మ నాయుడు గారు, శ్రీ నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు గారు, శ్రీ దండా  బ్రహ్మనందంగారు గార్లచే భూమిపూజ కార్య క్రమము, సంఘ అధ్యక్షలు శ్రీ నాగోతు శౌరయ్యగారు, అప్పటి కార్యదర్శి శ్రీ గరికపాటి వెంకటేశ్వర రావుగారు మరియు సంఘ కార్యవర్గం ఆధ్వర్యంలో నిర్వహించబడినది. ఈ బ్లాకునకు శ్రీ నాగోతు   శౌరయ్యగారు రూ. 10,00,000/- శ్రీ బోల్లినేని కృష్ణయ్యగారు 10,00,000/- విరాళముగా మొత్తం ఇద్దరు కలిసి రూ. 20,00,000/- లు ఇచ్చినందున ఈ బ్లాకునకు శ్రీ మతి నాగోతు జోస్ఫీన్ ,శౌరయ్యగార్ల మరియు శ్రీమతి బోల్లినేని సుజాతమ్మ, కృష్ణయ్యగార్ల బ్లాకు గా నామకరణం చేయడం జరిగినది.

ఈ బ్లాకులోని గ్రౌండ్ ఫ్లోర్లోని మీటింగు హాల్ నకు  శ్రీ రావెల సత్యనారాయణ గారు రూ 10,00,000/-  మరియు ఫస్ట్ ఫ్లోర్  నకు  శ్రీ జి.వి.ఆంజనేయులు గారు (శాసనసభ్యులు  వినుకొండ )(లోగడ 3,00,000/- + ఇప్పుడు 7,00,000/- ) వెరశి మొత్తం రూ 10,00,000/- విరాళములు ఇచ్చియన్నారు.

ఈ బ్లాకులోని సెకండ్ ఫ్లోర్ నకు శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ గారు  రూ 5,00,000/- లు ,శ్రీ వేములపల్లి వెంకటనర్సయ్యగారు రూ 5,00,000/- లు వెరిసి రూ 10,00,000/- లు విరాళముగా ఇచ్చివున్నారు.

2వ బ్లాక్: రెండవ బ్లాకునకు శ్రీమతి నాగోతు జోస్ఫిన్ , శోరయ్యగార్ల మరియు శ్రీమతి బొల్లినేని సుజాత ,శ్రీష్ణయ్యగార్ల బ్లాకుగా నామకరం చేయుట జరిగినది. మొత్తము విరాళము రూ.20,00,000/- లు ఇచ్చియున్నారు.

గ్రౌండ్ ఫ్లోర్: ఈ బ్లాకులోని గ్రౌండ్ ఫ్లోర్నకు శ్రీ దండా బ్రహ్మనందం , శ్రీమతి లక్ష్మీరాజ్యం గార్ల ఫ్లోర్ గా నామకరణం చేయుట జరిగినది. విరాళము రూ. 10,00,000/- లు .

మీటింగ్ హాల్: ఈ రెండవ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని మీటింగ్ హాల్నకు శ్రీ రావెల సత్యనారాయణ ,శ్రీ మతి చంద్రావతి గార్ల మీటింగ్ హాల్గా నామకరణం చేయడం జరిగినది . విరాళము రూ. 10,00,000/- ఇచ్చివున్నారు .
ఫస్ట్ ఫ్లోర్ : ఈ రెండవ బ్లాక్ లోని ఫస్ట్ ఫ్లోర్ కు శ్రీ మతి గోనుగుంట్ల లీలావతి ఆంజనేయులుగార్ల ఫ్లోర్ గా నామకారణం చేయడమైనది. విరాళం రూ10,00,000/-లు ఇచ్చివున్నారు.

సెకండ్ ఫ్లోర్: ఈ రెండవ బ్లాక్ లోని సెకండ్ ఫ్లోర్ కు శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ శ్రీమతి మాధవీలతగార్ల మరియు శ్రీ వేములపల్లి వెంకటనర్సయ్య, శ్రీమతి సంపూర్ణమ్మ గార్ల ఫ్లోర్ గా నామకారణం చేయడమైనది. విరాళం రూ10,00,000/-లు ఇచ్చివున్నారు.

ఈ రెండవ బ్లాకు నిర్మాణ మొత్తము 12,000 చదరపు అడుగులు కలిగి షుమారు 78 లక్షలు ఖర్చుతో పూర్తికావించబడి ది. 06-12-2015 న ప్రారంభోత్సవము జరుపబడినది .

హాస్టల్లో నివసించు విద్యార్థినులకు ఇప్పటివరకు పరువు,దిండ్లు ఏర్పాటు చేయడమైనది. ఈ సంవత్సము మన సంఘ మహారాజషోషకులైన గౌ|| శ్రీ దండా బ్రహ్మానందం గారు, ఎంతో ఔదార్యముతో 200 ఇనుప మంచములను షుమారు రూ .8,00,000/- లతో చేయించి ఇచ్చినారు. మీరు ఇంతకు పూర్వము భవన నిర్మాణమునకు రూ. 10,00,000/-లు ఇచ్చినారు. వారి విరాళము మొత్తము వెరశి 18,00,000/-లు ఇచ్చివున్నారు.