About Us

Hostel Block Opening by Sri Rama Tarakam

Hostel Block Opening by Sri Rama Tarakam (Mother of Sri Nallapati Rattaiah Garu)

ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం వుంది. ముఖ్యంగా విద్యారంగంలో అన్ని జిల్లాలకన్నా గుంటూరు జిల్లాదే అగ్రస్థానం. నరసరావుపేట పట్టణంలో రాయలసీమ వాసులకు, పల్నాటి వారికి ఎందరికో విద్యనందించి విద్యారంగంలో ప్రముఖ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం మారుతున్న కాలంతో విద్యారంగంలో విద్యార్థినుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

నరసరావుపేటలో ఇంటర్ మీడియట్, డిగ్రీ మొదలైన సాధారణ కోర్సులతో పాటు ఇంజనీరింగ్, ఫార్మశి, బయో టెక్నాలజీ, నర్సింగు మొదలైన ఆధునిక కోర్సులను ఎంతోమంది విద్యార్థినుల అభ్యసించడము జరుగుతుంది . అయితే నరసరావుపేట పట్టణములో వీరికి తగిన వసతి గృహము లేనందున చాలా మంది ముఖ్యముగా గ్రామీణ ప్రాతం నుండి వచ్చు విద్యార్థినులు వ్యయప్రయాసలకు లోనగుచున్నారు. అందువలన కమ్మ మహాజన సేవాసంఘము నరసరావుపేటలో పేద విద్యార్థినులకు వసతి గృహనిర్మాణము చేపట్టినది.

కమ్మ మహాజన సేవ సంఘం 1971 లో ఏర్పడింది. ఈ సంఘమునకు కీ”శే” నల్లపాటి వెంకట రామయ్య గౌరవాధ్యక్షులుగా కీ”శే” పుల్లెల దశరధ రామయ్య అధ్యక్షులుగా, కీ”శే” తోటకూర వెంకటేశ్వర రావు ఉపాధ్యక్షులుగా, శ్రీ గంగవరపు వెంకటేశ్వర్లు కార్యదర్శిగా, శ్రీ వింజం వెంగయ్య చౌదరి సహాయ కార్యదర్శిగాను, కీ”శే” మేకా హరినీడు కోశాధికారిగాను వ్యవహరించారు. ఈ సంఘంలో శ్రీయుతులు శ్రీ బొప్పన పూర్ణచంద్ర రావు, శ్రీ సి.హెచ్.ల్. కాంతారావు, శ్రీమతి పాలడుగు అన్నపూర్ణమ్మ , శ్రీ చెన్నుపాటి వీరయ్య, కీ”శే” డి.ఎం.కె. చౌదరి. శ్రీ నాయుడు వెంకయ్య, శ్రీ చేకూరి వెంకయ్య, శ్రీ కె.సి.ఆర్. నాయుడు, కీ”శే” పి.ఎస్.ఆర్. కృష్ణయ్య చౌదరి, కీ”శే” కరణం పెద్దన్న, కీ”శే” గింజుపల్లి పున్నయ్య మొదలైన ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. తరువాత కొంత కాలానికి ఈ సంస్థ హాస్టల్ నిర్మించాలనే ఉధ్యేశ్యంతో N.G.O కాలనీ సమీపం లో 52 సెంట్ల స్థలం కొనుగోలు చేయటం జరిగింది. 1971 నుండి ఈ సంస్థలో పలువురు పెద్దలు సభ్యులుగా ఉన్నారు. నేడు ఈ సంఘము కమ్మ మహాజన సేవా సంఘముగా కొనసాగింపబడుచున్నది.

కమ్మ మహాజన సేవా సంఘం ఆశయాలు :

  • అన్ని సామజిక వర్గాల ప్రజల మధ్య పరస్పర సహకారం, ఐకమత్యం పెంపొందించుట
  • విద్యా రంగంలో ప్రతిభ సామర్ధ్యం గల పేద విద్యార్థినులకు ఉపకార వేతనముల ద్వారా ఆర్ధిక సహాయం అందించుట
  • విద్యా సంస్థలు, పఠన మందిరాలు, వసతి గృహములు, వృధాశ్రమాలు, పత్రికలు మొదలైన వాటి ద్వారా సామాజిక సేవ చేయుట
  • విద్యా, వ్యాపార రంగాలలో యువతకు మార్గదర్శకాలు నిర్ధేశించుట
  • అన్ని సామాజిక వర్గాల పేద ప్రజలకు ఆరోగ్యము, న్యాయము మొదలైన విషయాలలో సలహాలు, సహకారము అందించుట
  • సాంఘిక, సాంస్కృతిక రంగాలలో, కళలలోను ప్రావీణ్యమున్న వారిని గుర్తించి, గౌరవించి ప్రోత్సహించుట
మొదలైన అభివృద్ధికరమైన కార్యక్రమములను కమ్మ మహాజన సేవా సంఘము నిర్వహించుటకు పూనుకున్నది.