Terms & Conditions

విద్యార్థినులు ఈ దిగువ తెలియపరచిన నియమ నిబంధనలు పాటించవలెను:

 

1. డిగ్రీ మరియు ఆపై తరగతులు చదువు విద్యార్థినులు మాత్రమే హాస్టల్ లో చేరుటకు అర్హులు

2. జులై 1 నుండి ఏప్రిల్ 30 వరకు విద్యాసంవత్సరముగా పరిగణింపబడును. హాస్టల్ ఫీజు చెల్లింపు విషయములో రోజువారీ లెక్కలు అనుమతించబడదు. ఈ విద్య సంవత్సరమునకు ఫీజు రూ. 20,000/- లుగా నిర్ణయించడమైనది. ప్రవేశ సమయములో రూ. 12,000/- లు అడ్వాన్సుగా చెల్లించవలెను. మిగిలిన రూ. 8,000/- దసరా సెలవుల అనంతరం చెల్లించవలెను. మే మరియు జూన్ మాసాలకు ఉండేవారు అదనంగా చెల్లించవలెను. విద్యార్థినులకు వసతి మాత్రమే ఉచితం.

3. వసతి గృహము ఆవరణలో విద్యార్థిని వద్ద సెల్ ఫోన్ లభించిన యెడల ఫీజు రిఫండ్ ఇవ్వకుండా పంపించి వేయబడును. అలాగే ల్యాప్ టాప్ ద్వారా ఫోన్ వాడుకున్న సరే ఫీజు రిఫండ్ ఇవ్వకుండా పంపించి వేయబడును.

4. ఏ విద్యార్థిని అయినా హాస్టల్ ఆస్తులకు నష్టము కలిగించిన యెడల తల్లి దండ్రులు / సంరక్షకులు ఆ నష్టము చెల్లించవలసియుండును.

5. ప్రవేశము ఇవ్వబడిన విద్యార్థినులు నిర్ణీత వ్యవధి లో హాస్టల్ ఫీజు చెల్లించనిచో ఆ ప్రవేశము రద్దు పరచి వేరొకరికి ఆ సీటు కేటాయించబడును.

6. స్టడీ సమయంలో విద్యార్థినులకు అసౌకర్యం కలగకుండా ఉండుటకు సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు , ఆదివారం ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఫోన్ లో తల్లి తండ్రులతో గాని , బంధువులతో గాని సంప్రదించుటకు అనుమతించబడును.

7. సరిగా క్లాసుకు పోనీ విద్యార్థినులను, పరీక్షలకు హాజరు కాని విద్యార్థినులను, హాస్టల్ నియమ నిబంధనలకు విరుద్ధముగా ప్రవర్తించువారిని హాస్టలు నుండి ఏ రోజైనను పంపి వేయుట జరుగును.

8. విద్యార్థినులు కాలేజీకు వెళ్లివచు సమయములు తప్ప వసతి గృహము వదలి బయటకు వెళ్ళుకాలము, వచ్చు కాలమునకు వార్డెన్ అనుమతి కావలెను. పరిస్థితులలోను సాయంత్రం 6 గంటలలోపు వసతి గృహమునకు రావలయును.

9. విలువైన ఆభరణములు వసతి గృహములో ధరించకుండుట మంచిది. వాటి జాగ్రత్త విషయములో విద్యార్థినులే శ్రద్ధ తీసుకొనవలసి ఉంటుంది. మేనేజెమెంట్ వారికి సంబంధం లేదు.

10. విద్యార్థినుల వద్ద రూ. 100/- లకు మించి ఉండరాదు. అంతకంటే ఎక్కువ డబ్బు ఉన్న యెడల వార్డెన్ గారికి ఇచ్చి రశీదు పొందవలెను. వారికి అవసరమైనప్పుడు చిన్న మొత్తములో డ్రా చేసుకొనవచ్చును.

11. సెల్ ఫోన్లు, టేప్ రికార్డర్లు, రేడియోలు, ఏ విధమైన ఎలక్ట్రానిక్ పరికరములు అనుమతించబడవు. ఒక విద్యార్థిని సెల్ ఫోన్ కలిగి ఉన్నచో ఆ విద్యార్థిని గదిలోని తోటి విద్యార్థినులు ఆ విషయమును వార్డెన్ దృష్టికి తీసుకొని రావలెను. ఆలా చేయకుండా వుండిన యెడల ఆ గదిలోని విద్యార్థినులందరు బాధ్యత వహించవలెను. ఒక వేళ ఏ విద్యార్థిని వద్ద సెల్ ఫోన్ వున్నదో ఆ విద్యార్థినిని నిర్ధాక్షిణ్యంగా బయటకు పంపించబడును. ఫీజు తిరిగి ఇవ్వబడదు.

12. విద్యార్థినులను చూచుటకు వచ్చు తల్లిదండ్రులు, సంరక్షకులకుగాని శనివారం సాయంత్రం 4:00 నుండి 6:00 గంటలు మరియు ఆదివారం ఉదయం 7:00 నుండి సాయంత్రం 6:00 గంటల మధ్య మాత్రమే అనుమతించబడును.

13. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు వసతి గృహములో ఉండుటకు అనుమతించబడరు.

14. విద్యార్థినులు హాస్టల్ బయట చేయు కార్యక్రమములతో హాస్టల్ మేనేజ్మెంట్ వారికి ఎటువంటి బాధ్యత లేదు. అట్టి విద్యార్థిని అభ్యంతరకర ప్రవర్తన విషయములు మేనేజ్మెంట్ వారి దృష్టికి వచ్చిన ఎడల విద్యార్థిని ని హాస్టల్ నుండి పంపించివేయడం జరుగుతుంది. విద్యార్థినులు ఇంటి నుండి హాస్టల్ కు, హాస్టల్ నుండి ఇంటికి వచ్చి వెళ్లునపుడు తోడుగా తల్లిదండ్రులు తప్పక రావలెను. అలా రాని విద్యార్థినులకు జరుగు కష్టనష్టములకు హాస్టల్ మేనేజ్మెంట్ కు బాధ్యత లేదు.

15. మీ కోసం వచ్చే సందర్శకుల వివరములు, వారి ఫోటోలు కూడా తప్పని సరిగా జత చేయవలసి ఉన్నది. అట్టివారిని మాత్రమే సందర్శకులుగా అనుమతించబడును. వీలైనంతవరకు తల్లిదండ్రులను మాత్రమే సందర్శకులుగా వ్రాయండి. సోదరులను వ్రాయకండి. సోదరులు అనుమతించబడరు. ఫోటో కార్డు ఉన్నవారు మాత్రమే హాస్టల్ విద్యార్థినులను కలుసుకొనుటకు అర్హులు.

16. డైనింగ్ హాల్ నుండి ఏ విధమైన తినుబండారములు రూములలోనికి తీసుకొని వెళ్ళరాదు.

17. వసతి గృహములో మిగతా విద్యార్థినులతో కలసిమెలసి ఉండవలయును.

18. వసతి గృహములోని పరికరములకు నష్టము కలుగచేయకూడదు. అట్టి నష్టం కలిగించిన యెడల వసతి గృహము యొక్క ఆస్తి విలువను విధ్యార్థిని నుండి వసూలు చేయబడును.

19. వసతి గృహములోని గదులను మరియు పరిసరములను శుభ్రముగా ఉంచవలెను. గదులలో విద్యార్థినులకు ఇనుప మంచములు ఏర్పాటు చేయబడినవి.

20. వసతి గృహములో గాని హాస్టల్ వెలుపలగాని సత్ ప్రవర్తన కలిగివుండవలయును.

21. ఏ విధమైన తేడాలు లేకుండా హాస్టల్ విద్యార్థినులందరు ఒకే విధమైన సదుపాయములు పొందగలరు.

22. హాస్టల్ విద్యార్థినులు నీరు, కరెంటు వాడకం విషయంలో పొదుపుగా ఉండవలెను. లేనిచో మేనేజ్మెంట్ వారు తీసుకోను చర్యలకు బాధ్యత వహించవలెను. ఆహార పదార్ధములు వృధా చేయరాదు.

23. మీరు ఉండే రూముతోపాటు డైనింగ్ హాల్, వాష్ బేసిన్లు మరియు టాయిలెట్లు వాడకం విషయంలో పరిశుభ్రత పాటించవలెను.